కాంగ్రెస్ హయాంలో దుర్మార్గపు పాలన

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ హయాంలో దుర్మార్గపు పాలన
– బీఆర్ఎస్ నాయకుల హౌస్ అరెస్ట్ స్వేచ్ఛకు భంగం
– మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
– తాండూరులో బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ హాయంలో దుర్మార్గపు పాలన సాగుతోందని తాండూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు.

శనివారం తాండూరు లో మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబుల పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల దీపా నర్సింలు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నేతలను పోలీసులు హోస్ అరెస్ట్ చేశారు.

తెల్లవారు జామున నేతల ఇళ్ల వద్దకు వెళ్లి నిర్బంధించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హాయంలో దుర్మార్గపు పాలన కొనసాగుతోందని అన్నారు. బీఆర్ఎస్ నాయకుల అరెస్టు చేయడం స్వేచ్ఛకు భంగం కలిగించడమే అని అన్నారు.

కాంగ్రెస్ పాలనను అందరూ గమనిస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

కొత్త ఫించన్‌ నీరీక్షణకు తెర..!