ఘనంగా రామన్న బర్త్ డే..!
– చెంగోల్లో అట్టహాసంగా వేడుకలు
– శుభాకాంక్షలు తెలిపిన రాకేష్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు తాండూరు మండలంలో ఘనంగా జరుపుకున్నారు.

శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ తాండూరు మండల ప్రధాన కార్యదర్శి రాకేష్ గౌడ్ ఆధ్వర్యంలో చెంగోల్ గ్రామంలో కేటీఆర్ బర్త్ డే వైభవంగా నిర్వహించారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా రాకేష్ గౌడ్ కేక్ కట్ చేశారు. పార్టీ నాయకులకు తినింపించి.. కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జై కేటీఆర్.. జై జై కేటీఆర్ అంటూ నినాదాలతో హుషారెత్తించారు.

ఈ సందర్బంగా రాకేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కేటీఆర్ పాత్ర ఎంతో కీలకమైందన్నారు. ఐటీ రంగాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే కాకుండా పారిశ్రామిక రంగంలో భారీ పెట్టుబడులు తీసుకొచ్చి లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన దూరదృష్టి కలిగిన నాయకుడు కేటీఆర్ అని కొనియాడారు.

కేటీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరిన్ని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రఘు, నరేష్, బాలప్ప, సురేష్, నారాయణ రెడ్డి, చిన్నరాజు, రవి, బీఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.


