వీవీటీఎస్‌లో విద్యార్థులకు పోటీలు

తాండూరు వికారాబాద్

వీవీటీఎస్‌లో విద్యార్థులకు పోటీలు
– వజోత్సవాలపై చిత్రలేఖనం, వ్యాసరచన
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు పట్టణంలోని వేధిక్ విశిష్ఠ ది స్కూల్(వీవీటీఎస్)లో విద్యార్థులకు పోటీలను నిర్వహించారు. భారత స్వాతంత్ర పత్రోత్సవాల సందర్భంగా గురువారం పాఠ‌శాల‌లో 1 నుంచి 5 తరగతి విద్యార్థులకు చిత్రలేఖనం, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాంటెంట్ సుహాస్, ప్రిన్సిపల్ నాగభూషణంలు మాట్లాడుతూ విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలని అన్నారు. విద్యార్థులకు పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు జాతీయ సమక్యతపై చైతన్యం కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు రాములు, మహిపాల్ రెడ్డి, మంజుల, మేనేజ్ మెంట్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.