బుయ్యని స్పూర్తి.. దాతల సేవా నిరతి..!
– చిన్నారి వశిష్టకు పెరుగుతున్న ఆర్థిక సాయం
– శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో మరో రూ. 58వేల అందజేత
– కిరాణా మర్చంట్స్ అసోసియేషన్‌కు అభింనదలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆపదలో ఉన్న చిన్నారిని ఆదుకోవాలని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి అందించిన స్పూర్తికి దాతలు ముందుకు వచ్చి వారి సేవా నిరతిని చాటుకుంటున్నారు. యాలాల మండలం సంగెంకకు చెందిన శివకుమార్, భానుప్రియ దంపతుల 9నెలల వశిష్ట అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

ఈనెల ప్రారంభంలో వెలుగులోకి వచ్చిన సంఘటనపై బుయ్యని శ్రీనివాస్ రెడ్డి చలించిపోయారు. మొదటగా తన చేతుల మీదుగా కుటుంబానికి రూ. 50వేల ఆర్థిక సాయం అందజేశారు. ఆ వెంటనే రెండు రోజుల తరువాత జరిగిన శ్రీనివాస్ రెడ్డి తన పుట్టిన వేడుకలకు బోకేలు, శాలువాలు తీసుకరాకుండా ఆ ఖర్చులను చిన్నారి వశిష్ట చికిత్స కోసం అందచేలా చెల్లించాలని కోరారు. శ్రీనివాస్ రెడ్డి పిలుపు మేరకు పలువురు నగదు రూపంలో రూ.35వేలు, మిగతా 67 వేల రూపాయిలు ఫోన్ పే, గూగూల్ పే, ఆన్ లైన్ ద్వారా చెల్లించారు. తాజాగా తాండూరు కిరాణా మర్చంట్స్ అసోసియేష్ సభ్యులు కూడా శ్రీనివాస్ రెడ్డి స్పూర్తితో రూ. 53వేల 170లను శ్రీఇవాస్ రెడ్డి సమక్షంలో వశిష్ట తండ్రికి అందజేశారు.

అదేవిధంగా తాండూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డా.శరత్ చంద్ర కూడా ఆయన తరుపున భీమ్ శెట్టి అనిల్ కుమార్ రూ. 5వేలను అందజేశారు. ఇందుకు శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ కిరాణ మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులు అభినందించారు. ఇంకా దాతలు ముందుకు వచ్చిని ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు చిన్నారిని కాపాడుకోవాలని శ్రీనివాస్ రెడ్డి అందిస్తున్న స్పూర్తితో దాతలు సాయం చేసేందుకు ముందుకు రావడం పట్ల పార్టీ నేతలు, శ్రీనన్న అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదికూడా చదవండి…

