అభివృద్ధిపై ఇంత చిన్నచూపా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అభివృద్ధిపై ఇంత చిన్నచూపా..!
– పాలన చేతగాకుంటే రాజీనామా చేయండి
– ఎమ్మెల్యే, చైర్ పర్సన్‌లపై కౌన్సిలర్ జావిద్ ఫైర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహ కల్ప, ఇందిరమ్మ కాలనీల అభివృద్ధిపై చిన్నచూపు చూస్తున్నారని 8వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ మండిపడ్డారు.

ఎమ్మెల్యే, చైర్ పర్సన్‌లకు పాలన చేతకావడం లేదని, వారు పదవులకు రాజీనామా చేయాలని ద్వజమెత్తారు. బుధవారం సాయంత్రం ఆయన కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలనీలో కురస్తున్న వర్షాల వల్ల రోడ్లు ఆధ్వన్నాంగా తయారయ్యాయని తెలిపారు.

కాలనీలో రాకపోకలు సాగించే వారు కిందపడి ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వార్డుపై చిన్నచూపు చూస్తుందని విమర్శించారు. ఎమ్మెల్యే, చైర్‌ పర్సన్‌లు కాలనీల అభివృద్ధిపై వివక్ష చూపిస్తున్నారని అన్నారు.

తాండూరు అభివృద్ధిపై వారికి చిత్త శుద్ది లేదని అన్నారు. పాలన చేతకాకపోతే వారు పదవులకు రాజీనామా చేయాలని అన్నారు. కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామని గొప్పలు చెప్పడమే తప్పా మూడేళ్లు గడిచినా ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారని అన్నారు. ఇప్పటికైనా అభివృద్ధికి శ్రద్ద చూపించకపోతే కార్యాలయాలు, నివాసాల ముట్టడికి వెనుకాడమని హెచ్చరించారు.

చదువుతో యోగాను భాగం చేసుకోవాలి