పేదలపైనే జులుం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పేదలపైనే జులుం..!
– నడిబొడ్డున అక్రమాలను కనిపించవా
– మూగజీవాల షెడ్డు తొలగింపులో దౌర్జన్యం
– మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ యంత్రాంగం పేదలపై జులం ప్రదర్శిస్తోందని మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు మండిపడ్డారు.

పట్టణంలోని సాయిపూర్ ప్రాంతంలో స్థానికులు మూగ జీవాల కోసం వేసుకున్న షెడ్డును మంగళవారం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు జేసీబీతో తొలగించారు. ఈ సంఘటనపై మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు వ్యతిరేకించారు.

బాధితులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితులు వారికి చెందిన భూమిలో షెడ్డు వేసుకుంటే.. అది ప్రభుత్వ భూమి అని అధికారులు షెడ్డును దౌర్జన్యంగా కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలపైనే జులం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. పట్టణ నడిబొడ్డున ప్రభుత్వ భూముల్లో అక్రమణలు జరుగున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మున్సిపల్ ముందే ఆక్రమణలు జరుగుతుంటే కన్నెత్తి చూడడం లేదని విమర్శించారు.

పట్టణంలో జరుగుతున్న ఆక్రమాలపై అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని సహించబోమని, ఆక్రమాలపై ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కేవలం బీఆర్ఎస్ పార్టీకి, మాజీ ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉన్నారనే కారణంతోనే బాధితులకు సంబంధించి షెడ్డును కూల్చివేశారని అన్నారు. బాధితులకు న్యాయం జరిగేందుకు అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కౌన్సిలర్లు జావిద్, యోగనంద్, ఈర్షద్, మహేశ్వరి, సురేష్ నాయక్, నాయకులు సంతోష్ గౌడ్, కరుణాకర్ పటేల్ తదితరులు ఉన్నారు.

యువత లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలి