గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల కృషి ఎనలేనిది
– ఎన్నికల వరకు వారి పదవి కాలాన్ని కొనసాగించాలి
– తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– 98 గ్రామాల సర్పంచులకు సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల కృషి ఎనలేనిదని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఈనెలాఖరుతో సర్పంచుల పదవి కాలం పూర్తవుతున్న నేపథ్యంలో శుక్రవారం తాండూరు నియోజకవర్గంలోని 98 గ్రామాల సర్పంచులకు సన్మానం నిర్వహించారు. తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. పైలెట్ రోహిత్ రెడ్డి గ్రామాల సర్పంచులను సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హాయాంలో ఎన్నికైన సర్పంచులు గ్రామాల అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. ఎన్నడూ లేని విధంగా మాజీ సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించారని అన్నారు. గ్రామాల ప్రగతిలో సర్పంచులు ఈ ఐదేండ్లు ఎనలేని కృషి చేశారని, సేవలను కొనియాడారు. వచ్చే ఎన్నికల వరకు సర్పంచుల పదవి కాలాన్ని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీశైల్ రెడ్డి, మండలాల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, కోహీర్ శ్రీనివాస్ యాదవ్, ఇందర్ చెడ్ రాజు, సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

