జోష్‌పుల్‌గా తాండూరు కబడ్డీ పోటీలు
– ఛాంపీయన్‌గా పెద్దేముల్ లయన్స్ జట్టు
– రన్నరప్‌గా నిలిచిన కోట్ పల్లి కింగ్స్
– క్రీడాకారులను అభినందించిన భావనోళ్ల శంకర్ యాదవ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : హిందూ ధార్మిక పరిషత్ మరియు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) సంయుక్తంగా నిర్వహించిన శ్రీ సాయిపుత్ర హోమ్స్ తాండూరు కబడ్డీ ఛాంపియన్ షిప్ (2026) పోటీలు జోష్‌పుల్‌గా కొనసాగాయి.

ఆదివారం పట్టణంలోని అక్షర పాఠశాలలో నిర్వహించిన పోటీలలో పెద్దేముల్ లయన్స్ జట్టు విజేతగా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోటీలో కోట్ పల్లి కింగ్స్ జట్టుపై పెద్దేముల్ లయన్స్ విజయం సాధించింది. బషీరాబాద్ ఫైటర్స్, యాలాల ఈగల్స్, తాండూరు టౌన్ టైటన్స్, తాండూరు టైగర్స్, కోట్ పల్లి కింగ్స్, పెద్దేముల్ లయన్స్ జట్ల మధ్య పోటీలు జరిగాయి.

కబడ్డీ పోటీల అనంతరం జరిగిన కార్యక్రమంలో శ్రీ సాయిపుత్ర హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) శంకర్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతగా నిలిచిన పెద్దేముల్ లయన్స్ జట్టు యజమాని మహిపాల్ రెడ్డి(గౌతమి పాఠశాల)కి ట్రోఫీని అందజేశారు. ఫైనల్ మ్యాచ్ లో ఓడిన కోట్ పల్లి కింగ్స్ జట్టు యజమాని రాములు యావద్ కు రన్నరప్ ట్రోఫీని అందజేశారు.

ఈ కార్యక్రమంలో యాలాల ఈగల్స్ యజమాని డాక్టర్ శరత్ చంద్ర, తాండూరు టౌన్ టైటాన్స్ యజమాని మార్వాడీ యువ మంచ్, తాండూరు టైగర్స్ యజమాని మనోహర్ యాదవ్, బషీరాబాద్ ఫైటర్స్ యజమాని అజయ్ ప్రసాద్, కోట్ పల్లి కింగ్స్ యజమాని రాములు యావద్, పెద్దేముల్ లయన్స్ యజమాని మహిపాల్ రెడ్డి, హిందూ ధార్మిక పరిషత్ కన్వీనర్ గాజుల బస్వరాజ్, ట్రస్టీలు ఓం ప్రకాష్ సోమాని, నరేందర్, పటేల్ విజయ్, వేణుగోపాల్ రెడ్డి, రమేష్, ఆలంపల్లి శ్రీనివాస్, జయంత్, బీసీ సంఘం జాతీయ కన్వీనర్ రాజ్ కుమార్, నేతలు బంటు మల్లప్ప, తపస్ బాధ్యులు గాజుల బస్వరాజ్, లక్ష్మీకాంత్, ఆనందం, అక్షర పాఠశాల ప్రిన్సిపాల్, ట్రెస్మా తాండూరు శాఖ అధ్యక్షులు మోహన్ క్రిష్ణ గౌడ్, వ్యాయమ ఉపాధ్యాయులు, ఆయా జట్ల కోచ్ లు పాల్గొన్నారు.


