స్థలాల విలువల తగ్గింపులో ఎమ్మెల్యే కృషి

తాండూరు రాజకీయం వికారాబాద్

స్థలాల విలువల తగ్గింపులో ఎమ్మెల్యే కృషి
– మనోహర్ రెడ్డికి డాక్యుమెంట్ రైటర్ల కృతజ్ఞతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో స్థలాల మార్కెట్‌ విలువలను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేసిన కృషిపై స్థానిక డాక్యుమెంట్‌ రైటర్లు హర్షం వ్యక్తం చేశారు.

ఈ మేరకు బుధవారం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తాండూరులో గతంలో ఉన్న అధిక మార్కెట్‌ విలువల కారణంగా స్థలాలు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల సమయంలో ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు భూముల మార్కెట్‌ విలువలను తగ్గించాలని ఎమ్మెల్యేకు పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు.

తమ విజ్ఞప్తిని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. ప్రజల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం చొరవ చూపిన ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా డాక్యుమెంట్‌ రైటర్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ వడ్డె శ్రీనివాస్, డాక్యుమెంట్‌ రైటర్లు, తదితరులు పాల్గొన్నారు.

ప్రకృతి రాఖీ.. ప్రత్యేకం..!