మ‌ల్లారెడ్డి ఖ‌బ‌డ్దార్..!

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

మ‌ల్లారెడ్డి ఖ‌బ‌డ్దార్..!
– మంత్రి ప‌ద‌విలో ఉండి నోరుజార‌డం సిగ్గుచేటు
– రేవంత్‌రెడ్డికి బ‌హిరంగా క్ష‌మాప‌ణ చెప్పాలి
– పెద్దేముల్‌లో కాంగ్రెస్ నాయ‌కుల నిర‌స‌న
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: టీపీసీసీ అధ్య‌క్షులు, ఎంపీ రేవంత్‌రెడ్డిపై నోరుజారితే ఖ‌బ‌డ్ద‌దార్ అంటూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి తాండూరు నియోజ‌క‌వ‌ర్గం పెద్దేముల్ మండ‌ల కాంగ్రెస్ నాయ‌కులు హెచ్చ‌రించారు. గురువారం పెద్దేముల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్, గ్రామ కమిటీ అధ్యక్షులు, ఎంపీటీసీ న్యాయవాది అంబరయ్య ఆధ్వ‌ర్యంలో మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద నాయ‌కులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. టీపీసీసీ అధ్య‌క్షులు రేవంత్‌రెడ్డిపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నోరుజార‌డంపై ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంద‌ర్భంగా గోపాల్, అంబర‌య్య‌ల‌తో పాటు ప‌లువురు నాయ‌కులు మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రి పదవిలో ఉంటూ బూతు పదాలతో ద్వేషించడం రాష్ట్రానికే సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. భూ కబ్జాలకు పాల్పడుతున్న మల్లారెడ్డి ఆస్తులపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వీధి రౌడీలా వ్యవహరిస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్న ఇటువంటి మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మ‌రోసారి నోరు జారితే నాలుక కోస్తామ‌ని మండిప‌డ్డారు. మ‌రోవైపు నాయ‌కుల ఆందోళ‌న విష‌యం ఎస్సై విశ్వజన్ త‌న‌ సిబ్బందితో చేరుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడి ఆందోళ‌న‌ను విర‌మింప చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ రియాజ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పెండ్యాల ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు మల్లేశం, డివై.నర్సాముల్, చెట్ల మీది రామప్ప, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.