సీఎం రేవంత్‌రెడ్డికి పాలాభిషేకం

తాండూరు రాజకీయం వికారాబాద్

సీఎం రేవంత్‌రెడ్డికి పాలాభిషేకం
– కృతజ్ఞతలు తెలిపిన ఉద్యమ కారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ఉద్యమకారుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించడాన్ని హర్షిస్తూ ఆయన చిత్రపటానికి తాండూరుకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు పాలాభిషేకం నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్, గుర్తింపు, గౌరవం కల్పించేందుకు సీఎం సానుకూలంగా స్పందించడం అభినందనీయమన్నారు.

కేకే కమిటీ ఉద్యమకారుల సమస్యలను జిల్లాల వారీగా గుర్తించి ప్రభుత్వానికి నివేదించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఉద్యమకారులకు అమలు చేస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోని బాయ్ శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సంజయ్ గౌడ్, కోఆర్డినేటర్, న్యాయవాది జిలాని, జిల్లా ఉపాధ్యక్షులు జి. ప్రకాష్ గౌడ్‌తో పాటు అశోక్, మోయిస్ బేగ్, వెంకటయ్య, ధనరాజ్, శ్రీను, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ఆగ్‌మాన్‌లతో ఆగమాగం చేయొద్దు