థ్యాంకూ.. అక్కా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

థ్యాంకూ.. అక్కా..!
– స్వప్న పరిమళ్‌పై అభిమానం
– ప్రత్యేక కేక్‌ తయారు చేయించిన లబ్దిదారులు
– సొంతింటి కల సాకారం చేయూతకు కృతజ్ఞతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌పై ఓ పేదింటి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా భావాన్ని చాటుకున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తమ సొంతింటి కల సాకారంకు చేయూతను అందించడం పట్ల ప్రత్యేక కేక్ తయారు చేయించి.. ఆమె చేతనే కట్ చేయించి అభిమానం నిలుపుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్‌గా స్వప్న పరిమళ్‌ కొనసాగుతున్న సమయంలో ఆమె వార్డు 27లో ఉన్న రజియా బేగం–దస్తగిర్‌లు ఇందిరమ్మ పథకం కింద సొంత ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు.

వారిని అర్హులుగా గుర్తించిన స్వప్న పరిమళ్ వారికి సొంతింటి నిర్మాణం కోసం ప్రోసిడింగ్స్ అందజేశారు. తాజాగా శుక్రవారం రజీయా భేగం కుటుంబ సభ్యులు ఇందిరమ్మ పథకం కింద సొంతింటి గృహ ప్రవేశ కార్యక్రమం చేపట్టారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ ఇంటి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

అనంతరం కుటుంబ సభ్యులు థ్యాంకూ అన్న అనే పేరుతో స్వప్న పరిమళ్‌ లబ్దిదారులకు అందిస్తున్న ఫ్రోసిడింగ్‌ ఫోటోతో ప్రత్యేక కేక్‌ను తయారు చేయించారు. స్వప్న పరిమళ్‌ను, ప్రస్తుత వార్డు కౌన్సిలర్ స్వరూప మల్లేశంలను కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. తమ సొంతింటి కలను సాకారం చేయడంలో చేయూతను అందించిన స్వప్న పరిమళ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పేదల సొంతింటి కల సాకారమే ధ్యేయం