స్వచ్ఛత వారోత్సవాలకు సిద్దం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

స్వచ్ఛత వారోత్సవాలకు సిద్దం..!
– ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
– 28నుంచి ప్రతి 6వార్డుల్లో కార్యక్రమాలు
– హాజరు కానున్న తాండూరు ఎమ్మెల్యే
– మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తాండూరు మున్సిపల్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛత వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి తెలిపారు.

శనివారం ఆమె కార్యాలయంలో మాట్లాడుతూ.. ఈ నెల 28 నుంచి స్వచ్ఛత కార్యక్రమాలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవలం పారిశుద్ధ్య పనులకే పరిమితం చేయకుండా ఆయా వార్డుల్లో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

ప్రతిరోజూ 6వార్డులలో కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ప్రతి వార్డులో నిర్వహించే కార్యక్రమాల్లో సంబంధిత కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్లు, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొంటారని, పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను వివరించడం, స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించడం కార్యక్రమంలో ప్రధాన అంశాలుగా ఉంటాయన్నారు.

దీంతో పాటు ఫించన్, సంక్షేమ పథకాల సమస్యలను కూడా తెలుసుకోవడం జరుగుతుందన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.

నలుగురితో మొదలు.. 40 మందికి చేర్చి..!