కోట్ పల్లి మార్కెట్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా మధులత శ్రీనివాసచారి

తాండూరు రాజకీయం వికారాబాద్

కోట్ పల్లి మార్కెట్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా మధులత శ్రీనివాసచారి
– గతంలో పెద్దేముల్‌ వైస్‌ ఎంపీపీగా సేవలు..
– తాజాగా మరో కీలక పదవి
– ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి కృతజ్ఞతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కోట్ పల్లి మార్కెట్‌ కమిటి వైస్‌ చైర్‌పర్సన్‌గా మధులత శ్రీనివాసచారి నియమితులయ్యారు. శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

గతంలో పెద్దేముల్‌ మండల వైస్‌ ఎంపీపీగా పనిచేసిన ఆమెకు తాజాగా మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్‌పర్సన్‌ గా కీలక పదవి అప్పగించారు.

ఈ సందర్భంగా మధులత శ్రీనివాసచారి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్‌ కమిటీ అభివృద్ధికి, రైతులు మరియు వ్యాపారుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

పట్టభద్రుల ఓటు తప్పక నమోదు చేసుకోవాలి