జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో తాండూరు యువకుల సత్తా..!
– బ్రిన్స్ మోడల్ టైటిల్స్ కైవసం చేసుకున్న సాయి కుమార్, రాకేష్
– విజేతలను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో తాండూరు పట్టణానికి చెందిన యువకులు ప్రతిభ చాటారు.

శంషాబాద్‌లోని ఆల్ఫా మజిల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో తాండూరుకు చెందిన సాయి కుమార్ (ఎన్టీఆర్ కాలనీ), రాకేష్ (సుభాష్ నగర్) బ్రిన్స్ మోడల్ టైటిల్స్‌ను కైవసం చేసుకుని పట్టణానికి గుర్తింపు తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా విజేతలను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బాతుల నాగు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయ స్థాయిలో తమ ప్రతిభను నిరూపించుకున్న యువకులు తాండూరుకు గర్వకారణమని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.


