అదుపులోకి కరోనా..!
– తగ్గుతున్న పాజిటివ్ కేసులు
– తాండూరులో 76 మందికి కోవిడ్ నిర్ధారణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంతంలో కొన్ని రోజులుగా భారీగా నమోదు అవుతున్న కేసులు అదుపులోకి వస్తున్నాయి. రెండు రోజులుగా పాజిటివ్ కేసుల నిర్ధారణ తగ్గుముఖం పట్టాయి. ఆదివారం 65 కేసులు నమోదు కాగా సోమవారం 76 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు తాండూరు ప్రాంతంలో వందకు పైగా కేసులు నమోదైన విషయం తెలిసిందే. రెండు రోజులుగా కేసులు తక్కువగా నమోదు కావడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. సోమవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 204 మందికి పరీక్షలు నిర్వహించగా 64 మందికి, మాతా శిశు ఆసుపత్రిలో 85 మందికి పరీక్షలు నిర్వహించగా 12 మందికి మొత్తం 76 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు పీపీ యూనిట్ ఇంచార్జ్ డాక్టర్ భాస్కర్ తెలిపారు. ప్రజలు కోవిడ్ పట్ల నిర్లక్ష్యంగా ఉండరాదని ఆయన అన్నారు. మాస్కులు, భౌతిక దూరం పాటించడంతో పాటు వ్యాక్సినేషన్ వేసుకోని తప్పక టీకా తీసుకోవాలని సూచించారు.

