మాస్కు లేకుండా వస్తే ఫైన్
– జరిమానాలు విధిస్తున్న పోలీసులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతిధి: కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఆంక్షలను విధిస్తున్న ప్రజలు భేఖాతరు చేస్తున్నారు. భౌతిక దూరం పాటించకపోవడంతో పాటు మాస్కులు లేకుండా విచ్చల విఢిగా తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే మాస్కులు లేని వారికి రూ. వేయ్యి జరిమాన విధించాలని ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తాండూరు మండలంలో నిబంధనలు పాటించని వారిపై కరణ్ కోట్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మాస్కులు లేకుండా బయటకు వస్తున్న జనాలకు జరిమానాలు విధిస్తున్నారు. మంగళవారం కరణ్ కోట్ పోలీసులు కోవిడ్ నిబంధనలపై తనిఖీలు చేపట్టారు. ఇంటి నుంచి మాస్కులు లేకుండా వస్తున్న వారికి జరిమానాలు విధించారు. అదేవిధంగా కరోనా కట్టడి కోసం ప్రభుత్వం కరోనా ఆంక్షలను అందరు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు.

