అభివృద్ధికి కృషి చేయండి
– మున్సిపల్ చైర్‌పర్సన్‌కు శుభాకాంక్షలు తెలిపిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఎన్ని అడ్డుంకులు వచ్చినా తాండూరును అభివృద్ధికి కృషి చేయాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ గుప్తతో టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్‌గా స్వప్న పరిమళ్ గుప్త గురువారంతో రెండేళ్ల పదవికాలం పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ రవీందర్ గౌడ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల, టీఆర్ఎస్ ఫ్లోరీడర్ శోభారాణి, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, టీఆర్ఎస్ నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, బంటు మల్లప్ప తదితరులు పుష్పగుచ్చాలు అందించి.. చైర్‌పర్సన్ స్వప్న పరిమళ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాలనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా తాండూరు పట్టణ అభివృద్ధి చేసి చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు తాటికొండ పరిమళ్ గుప్త, కౌన్సిలర్లు ప్రవీణ్ గౌడ్, వెంకన్నగౌడ్, బోయరవి, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, టీఆర్ఎస్వై రాష్ట్ర నాయకులు బిర్కడ్ రఘు, టీఆర్ఎస్‌వీ నాయకులు దత్తు, నాయకులు బీదర్ రాజశేఖర్, దావులయ్య, అశోక్, శ్రీకాంత్ రెడ్డి, టైలర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

