గంజాయి పండిస్తే సంక్షేమ పథకాలు క‌ట్

తాండూరు వికారాబాద్

గంజాయి పండిస్తే సంక్షేమ పథకాలు క‌ట్
– ఎవరైనా సాగుకు పాల్పడితే సమాచారం అందించండి
– గుట్కా, నాటునారా నియంత్రణకు సహకరించాలి
– తాండూరు రూరల్ సీఐ జలంధర్ రెడ్డి, జెడ్పీటీసీ గౌడీ మంజుల
తాండూరు రూరల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : గ్రామాల్లో ఎవరైనా గంజాయి సాగుకు పూనుకుంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేయడం జరుగుతుందని తాండూరు రూరల్ సీఐ జలంధర్ రెడ్డి, జెడ్పీటీసీ గౌడీ మంజుల వెంకటేశంలు అన్నారు. గురువారం తాండూరు మండలం కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులకు గంజాయి, గుట్కా, నాటుసార నియంత్రణపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా సీఐ జలంధర్ రెడ్డి, జెడ్పీటీసీ గౌడి మంజుల వెంకటేశంలు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గంజాయి, గుట్కా, నాటుసారా నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. ఎవరైనా గంజాయి సాగుకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలను రద్దు చే రాయబడతాయని హెచ్చరించారు. ఎవరైనా గంజాయిని సాగుచేస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. దీంతో పాటు గుట్కా, నాటుపారా తయారీ వ్యాపారాలు నిర్వహిస్తే కూడ సమాచారం అందించాలని సూచించారు. గంజాయి. నాటుసారా, నిషేధిత గుట్కా నియంత్రణకు పోలీసులకు సహ‌కరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు నేరాల నియంత్రణకు గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలన్నారు. యువత చెడుమార్గంలో పయనించకుండా శ్రద్ధగా తమ లక్ష్యాలను సాధించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ సైదులు, తాండూరు మండ‌ల సర్పంచుల సంఘం అధ్యక్షులు ఎస్ మేఘనాథ్ గౌడ్, సర్పంచులు బీడీ నాగప్ప, నాగార్జున, అమృత్ రెడ్డి, పట్లోళ్ల‌ నరేందర్ రెడ్డి, జగదీష్, చంద్రప్ప, మదన్మోహన్, పద్మమ్మ, సాయిలు, మాజీ ఎంపీటీసీలు గౌడ వెంకటేశం, పరశురామ్ నాయక్, నేతలు విజయ్ కుమార్, వెంకటరమణ గౌడ్, సిరిగిరిపేట్ అంబ్రిష్, ప్రభాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ హేమంత్ కుమార్, తాండూరు మండల బిజెపి అధ్యక్షులు సంజీవరెడ్డి, జినుగుర్తి ఉపసర్పంచ్ ఆశం అలీ, పలు గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.