శోభాయాత్రకు పకడ్బందీగా బందోబస్తు
– విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిఏ శివాజీ శోభాయాత్రలో పకడ్బందీగా బందోబస్తును చేపట్టాలని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఐపీఎస్ అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో బందోబస్తుపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి హాజరై సిబ్బందికి సలహాలు, సూచనలు అందజేశారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో పాటు శోభాయాత్ర బందోబస్తులో పాల్గొనే 262 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది విధులలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించరాదన్నారు. శోభాయాత్ర పూర్తి అయ్యేవరకు పోలీసు తమకు కేటాయించిన పాయింట్లలోనే ఉండాలన్నారు. బందోబస్తుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందితో స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకోవాలన్నారు. తాండూరు పోలీస్ అధికారుల ఫోన్ నెంబర్లు, తమ ఇంచార్జ్ అధికారుల ఫోన్ నెంబర్లు తీసుకోవాలని, బందోబస్త్ లో ఏమైనా ఇబ్బందులు ఉన్న వెంటనే తమ ఇంచార్జ్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. శోభాయాత్రలో బందోబస్తును పకడ్బందీగా, ప్రశాంతంగా జరిగేలా అందరు దృష్టిసారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీటీసీ అదనపు ఎస్పీ మురళీధర్, పరిగి డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి, తాండూరు డిఎస్‌పి శేఖర్ గౌడ్, సీఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

