అంబేద్క‌ర్ స్పూర్తితోనే అసమాన‌త‌ల స‌మాజ స్థాప‌న‌

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

అంబేద్క‌ర్ స్పూర్తితోనే అసమాన‌త‌ల స‌మాజ స్థాప‌న‌
– ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి
పెద్దేముల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: భార‌త రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్క‌ర్ స్పూర్తితోనే అస‌మాన‌త‌ల స‌మ స‌మాజాన్ని స్థాపించుకుందామ‌ని ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగ‌ళ‌వారం తాండూరు నియోజ‌క‌వ‌ర్గం పెద్దేముల్ మండ‌లం బండ‌మీది ప‌ల్లిలో ఏర్పాటు చేసిన డా.బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రై ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ స‌మాజంలో బడుగు బ‌ల‌హీన వ‌ర్గాల కోసం అంబేద్క‌ర్ ఎంతో కృషి చేశార‌ని అన్నారు. ఆయ‌న ర‌చించిన రాజ్యాంగంతోనే పేద‌లంద‌రు సంక్షేమ ఫ‌లాల‌ను పొందుతున్నార‌ని అన్నారు. అంబేద్కర్ స్పూర్తితోనే స‌మ స‌మాజాన్ని స్థాపించుకుందామ‌ని పిలుపునిచ్చారు. అంబేద్క‌ర్ ఆశ‌య సాధ‌న‌కు అంద‌రు కృషి చేయాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్య‌ద‌ర్శి క‌ర‌ణం పురుషోత్తంరావు, డీసీసీబీ మాజీ చైర్మ‌న్ ల‌క్ష్మారెడ్డి, తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ గుప్త‌, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సీనీయ‌ర్ కౌన్సిల‌ర్ ప‌ట్లోళ్ల నీర‌జా బాల్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.