కేసీఆర్‌ను దీవించండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కేసీఆర్‌ను దీవించండి..!
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– పట్లోళ్ల దీపా నర్సింలు ఆధ్వర్యంలో అన్నదానం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రజలందరు దీవించాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ మూడు రోజుల జన్మదిన వేడుకలలో భాగంగా మంగళవారం తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు ఆధ్వర్యంలో మొదటి రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పట్టణంలోని మర్రిచెట్టు రక్తమైసమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అన్నదానం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడూతూ సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సాగుతున్న సీఎం కేసీఆర్కు ప్రజలందరు ఆశీర్వదించాలన్నారు. సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం. అభివృద్ధి, అర్హులైన ప్రజలందరికి సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మూడు రోజుల జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్న నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలోమార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మాజీ డీపీసీ సభ్యులు పద్దోళ్ల నర్సింలు, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, భీంసింగ్, కోఆప్షన్ సభ్యులు వెంకట్రామ్ నాయక్, టీఆర్ఎస్ పట్టణ మహిళ అధ్యక్షురాలు సౌజన్య, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసాచారి, రాజుగౌడ్, మసూద్, నర్సిరెడ్డి, గోపాల్, సంజీవరావు, గుండప్ప, బెన్ బసప్ప, సంతోష్ గౌడ్, ఇంతియాజ్, చంటియాదవ్, విజయ్, సమద్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.