ఆదర్శప్రాయుడు శివాజీ మహారాజ్

తాండూరు వికారాబాద్

ఆదర్శప్రాయుడు శివాజీ మహారాజ్
– బీజేపీ నియోజకవర్గ ఇంచార్జ్ నరుకుల నరేందర్ గౌడ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : భారత సంస్కృతి పరిరక్షణలో చత్రపతి శివాజీ మహారాజ్ అందరికి ఆదర్శప్రాయుడుగా నిలిచారని బీజేపీ తాండూరు నియోజకవర్గ ఇంచార్జ్ నరుకుల నరేందర్ నరేందర్ అన్నారు. శనివారం శివాజీ మహారాజ్ 392వ జయంతి ఉత్సవాలలో భాగంగా తాండూరు పట్టణం సీతారాం పేట్లో గోందల్ సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన శివాజీ జయంతి ఉత్సవాలతో పాటు యాలాల మండలం జంటుపల్లిలో నిర్వహించిన జయంతి ఉత్సవాలలో నరేందర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివాజీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్త్రీల పట్ల గౌరవం, పరమత సహనం చాటిచెప్పిన మహానీయుడు శివాజీ అని అభివర్ణించారు. మొగల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి భారత దేశాన్ని హిందూ రాష్ట్రంగా నిలబెట్టి అందరికి ఆదర్శంగా నిలిచార‌న్నారు. శివాజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, జిల్లా నాయకులు పటేల్ విజయ్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి విజయకుమార్, ఉపాధ్యక్షులు ప్రవీణ్ కుమార్, సోషల్ మీడియా కన్వినర్ దాదాపూర్ గురు, బీజేవైఎం అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, లక్ష్మీకాంత్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.