పాఠశాల అభివృద్ధికి చొరవ చూపండి
– ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కోరిన కౌన్సిలర్ బొంబీనా
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులోని ప్రభుత్వ నెంబర్ 2 పాఠశాల అభివృద్ధికి చొరవ చూపాలని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని 14వ వార్డు ఎంఐఎం కౌన్సిలర్ బొంబీనా కోరారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పాఠశాల ఉపాధ్యాయులతో పాటు వినతిపత్రం అందజేశారు. పాత తాండూరులోని ప్రభుత్వ నెంబర్ 2 పాఠశాలకు ఇప్పటి వరకు సొంత భవనం లేదని, గతంలో గడి ప్రాంతంలో 10 గుంటల భూమిని కేటాయించిన భవనం అందుబాటులోకి రాలేకపోయిందని వివరించారు. పాఠశాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి పత్రం ద్వారా ఎమ్మెల్యేను కోరారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మన ఊరు – మన బడి ద్వారా పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నళిని, ఉపాధ్యాయులు శ్రీనివాస్, దామోదర్ రెడ్డి, మనోహర్, రమేష్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

