పేదల ఆరోగ్యానికి భరోసా.. సీఎంఆర్ఎఫ్
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– 157 మందికి రూ. 60లక్షల విలువైన ఎల్ఓసీల అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : సీఎంఆర్ఎఫ్ పథకంతో రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి భరోసా అందిస్తోందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు.

మంగళవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరు, బషీరాబాద్, యాలాల, పెద్దేముల్, తాండూరు పట్టణంకు చెందిన సీఎంఆర్ఎఫ్ పథకం కింద 157 మందికి మంజూరైన రూ. 60 లక్షల విలువైన ఎల్బీసీల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా ఆయా మండలాల లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్.ఎల్డీసీలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమానికి, ఆరోగ్యానికి ప్రజా ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని అన్నారు. ఈ పథకాలను అర్హులైన పేదలందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, నాయకులు అజయ్ ప్రసాద్, ఉప్పరి మల్లేశం, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ మండలాల లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

