భక్తి పారవశ్యంలో సునీతమ్మ
– జీవన్గీలో శివరాత్రి జాగరణ
– మహాదేవలింగేశ్వర అలయంలో ప్రత్యేక పూజలు
– పౌరాణిక వీధి నాటకం తిలకించిన జడ్పి చైర్ పర్సన్
– ‘అగ్నిగుండం’ ను వరుసగా రెండో సారి వెలిగించిన హ్యాట్రిక్ చైర్ పర్సన్
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. జిల్లాలోని తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలోని జీవన్గీ గ్రామంలో సునీతా మహేందర్ రెడ్డి శివరాత్రి జాగరణ చేశారు.
మంగళవారం అర్ధరాత్రి గ్రామానికి చేరుకున్న సునితమ్మకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం వరుసగా రెండో ఏడాది కూడా అగ్నిగుండంకు పూజలు చేసి నిప్పు వెలిగించారు. తర్వాత స్వామివారి పల్లకిసేవలో పాల్గొని, స్వయానా కొంతదూరం పల్లకిని మోశారు. అనంతరం గ్రామస్తులు శివాలయం దగ్గర ఆడిన పౌరాణిక వీధినాటకం తిలకించారు.

అక్కడే జాగరణలో ఉన్న భక్తులకు పండ్లు, చేతిబ్యాగులు అందజేశారు. జానపద, పౌరాణికి నాటకాలను ప్రోత్సహించాలని సూచించారు. భక్తితోనే మానశిక ప్రశాంతత కలుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సునీతా రెడ్డి గారి స్నేహితురాలు రాణి, బషీరాబాద్ ఎంపీపీ కరుణ, తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్, సీనీయర్ కౌన్సిలర్ నీరజ బాల్ రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, మాణిక్ రెడ్డి, నర్సిరెడ్డి, వీరారెడ్డి, టీఆర్ఎస్వీ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

