హస్తంలో చేరికల జోష్..!
– కాంగ్రెస్ గూటికి చేరికల వరద
– ఆహ్వానించిన డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో చేరికల జోష్ నిండుకుంది. సోమవారం హస్తం పార్టీలోకి చేరికల వరద చోటు చేసుకుంది. పట్టణంలోని 9వ వార్డుకు చెందిన నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, బంటు మల్లప్పల ఆధ్వర్యంలో 50 మంది, 27వ వార్డు మెహరాజ్ ఆధ్వర్యంలో 59 మందితో పాటు పట్టణంలోని శాంతినగర్ కు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అందరు బాధ్యతగా కృసి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, అబ్దుల్ రవూఫ్, అబ్దుల్ ఖవి, మాజీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, యువనాయకులు తాండ్రా రాకేష్, మహేష్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

