ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల ప‌రామ‌ర్శ‌

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల ప‌రామ‌ర్శ‌
– జుంటుప‌ల్లిలో దేవేంద‌ర్ గౌడ్‌కు నివాళులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: బాధిత కుటుంబాల‌ను ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు వారి వారి అనుచరుల‌తో వేర్వేరుగా ప‌రామ‌ర్శించారు. గురువారం యాలాల మండలం జుంటిపల్లి గ్రామంలో సీనియర్ నాయకుడు దేవేందర్ గౌడ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విష‌యం తెలుసుకున్న ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి గ్రామానికి చేరుకున్నారు.
దేవేవంద‌ర్ గౌడ్ పార్థివ దేహానికి ఎమ్మెల్సీ నివాళులు అర్పించారు. అనంత‌రం వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్సీ వెంట టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కర‌ణం పురుషోత్తం రావు, డీసీసీబీ ఉమ్మ‌డి జిల్లా డైరెక్ట‌ర్ రవిగౌడ్, యాలాల మాజీ జెడ్పీటీసీ సిద్రాల‌ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మ‌న్ సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కూడ బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు.
దేవేంద‌ర్ గౌడ్ భౌతిక ఖాయానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. ఆయ‌న మృతిప‌ట్ల విచారం వ్య‌క్తం చేశారు. అనంత‌రం కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించి ఓదార్చారు. కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట యాలాల ఎంపీపీ బాలేశ్వ‌ర్ గుప్త‌, తాండూరు మార్కెట్ క‌మిటి చైర్మ‌న్ విఠ‌ల్ నాయ‌క్, కోఆప్ష‌న్ స‌భ్యులు అక్బ‌ర్ బాబ‌, నాయ‌కులు ర‌వీంద‌ర్ రెడ్డి త‌దిత‌రులు ఉన్నారు.

రాంప్ర‌సాద్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్యే
మ‌రోవైపు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బషీరాబాద్ గ్రామ మాజీ సర్పంచ్, ప్రముఖ వైద్యులు డాక్టర్ రాంప్రసాద్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. డాక్ట‌ర్ రాంప్ర‌సాద్ ఇటీవల క‌న్నుమూశారు. ఈ విష‌యం తెలిసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి ప్ర‌క‌టించారు.
అదేవిధంగా ఇందర్చెడ్ గ్రామ సర్పంచ్ వీరా రెడ్డి సతీమణి మృతి చెందగా వారి కుటుంబాన్ని కూడ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప‌రామ‌ర్శించారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎమ్మెల్యే ఎం.నారాయ‌ణరావు, మండ‌ల పార్టీ అధ్య‌క్షులు రాములు నాయ‌క్, నాయ‌కులు రాజార‌త్నం త‌దిత‌రులు ఉన్నారు.