అట్టహాసంగా జర్నలిస్టు రఘు వివాహా వేడుక
– హాజరైన నేతలు, ప్రముఖులు, పాత్రకేయులు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: సూర్య నేటి దినపత్రిక వికారాబాద్ జిల్లా స్టాపర్ విలేకరి కె. రాఘవేందర్(రఘు) వివాహా వేడుక అట్టహాసంగా జరిగింది. బుధవారం శంషాబాద్ సమాసంలోని ఎంఎం గార్డెన్లో జరిగిన పెండ్లి వేడుకలకు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునితా మహేందర్ రెడ్డి, ప్రముఖ రాజకీయ నేతలతో పాటు సూర్య దిన పత్రిక డైరెక్టర్ రాంచందర్ రావు, నెట్ వర్క్ ఇంచార్జి భాస్కర్ రెడ్డి, తాండూరు ఇంచార్జ్ రాంచందర్, సీనియర్ జర్నలిస్టులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.



