18 భారత యూట్యూట్ చానెళ్ల నిషేధం
– ప్రకటించిన కేంద్ర సమాచారా, ప్రచార మంత్రిత్వ శాఖ
దర్శిని డెస్క్: తప్పుడు ప్రచారం, సమాచారం అందించే భారత 18 యూట్యూబ్ చానెళ్లపై నిషేధం విధించారు. అదేవిధంగా పాకిస్థాన్‌కు చెందిన 4 యూటూబ్ చానెళ్లపై కొరడా జులుపించారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. దేశ జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, ప్రజా శాంతికి సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు నిషేధం విధించినట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా 3 ట్విట్టర్(twitter) ఖాతాలు, ఒక ఫేస్‌బుక్(Facebook) ఖాతా, ఒక వార్తా వెబ్‌సైట్ కూడా బ్లాక్ చేయడం జరిగిందని తెలిపారు. వీక్షకులను తప్పుదారి పట్టించేందుకు యూట్యూబ్ ఛానెళ్లు.. టీవీ వార్తా ఛానెళ్ల లోగోలు, తప్పుడు సూక్ష్మచిత్రాలను ఉపయోగించాయని పేర్కొంది. ఈ యూట్యూబ్ ఛానెళ్లు నకిలీ వార్తలను వ్యాప్తి చేశాయని, సున్నితమైన విషయాలపై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశాయని ఆరోపణలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుటోంది. డిసెంబర్ 2021 నుంచి, జాతీయ భద్రత, పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించి 78 యూట్యూబ్ ఛానెళ్లు, అనేక ఇతర సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.


