మీ సేవా కేంద్రం సేవలు కీలకం

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

మీ సేవా కేంద్రం సేవలు కీలకం
– ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
– మున్సిప‌ల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల‌ దీపా నర్సింలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించడంలో మీ సేవ కేంద్రాల సేవలు కీలకమైనవని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ప‌ట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. బుధరవారం తాండూరు పట్టణం ఇందిరానగర్‌లో హుస్సేన్ ఖాన్ అనే వ్యక్తి ఏర్పాటు చేసిన మీసేవా కేంద్రాన్ని దీపా నర్సింలు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో పాటు రెవెన్యూ శాఖ ద్వారా పలు సేవలను మీ సేవా కేంద్రాల ద్వారానే అందించడం జరుగుతుందన్నారు. రైతులు రైతుబంధు, రైతుబీమా, వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు ఆసరా, కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ తదితర ప‌థ‌కాల‌ కోసం మీ సేవా కేంద్రాల ద్వారానే దరఖాస్తు చేసుకోవడం జరుగుతుందని గుర్తుచేశారు. ప్రజలు, విద్యార్థులు, రైతులు మీసేవా కేంద్రాల ద్వారా సులభంగా అందే సేవలను అందిపుచ్చుకోవచ్చన్నారు. మీ సేవా కేంద్రాల సేవలను ప్రజలు, లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అస్లాం, భీంసింగ్, స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్ సంజీవరావు, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, ఇంతియాజ్ బాబ, సలీం, చంటియాదవ్, ఆక్రమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.