జై హనుమాన్.. జైజై హనుమాన్..!
– తాండూరులో మార్మోగిన నామస్మరణ
– వైభవంగా హనుమాన్ జయంతి
– నేత్రపర్వంగా వీరహనుమాన్ శోభాయాత్ర
– పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు
(గమనిక: ఈ వార్తను క్రింది వరకు చదవండి)
తాండూరు, దర్శిని ప్రతినిధి: జై హనుమాన్.. జైజై హనుమాన్.. జయ జయ ద్వానాలతో తాండూరు పట్టణం మార్మోగింది. శనివారం తాండూరులో హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. కరోనా మహామ్మారి వల్ల రెండేళ్ల తరువాత ఈ ఉత్సవాలను జరుపుకున్నారు. రైల్వే స్టేషన్ హానుమాన్, సీతారాం పేట్ హానుమాన్, కన్యాపాఠశాల హనుమాన్ మందిరాలతో పాటు ఇతర ఆంజనేయ స్వామి దే వాలయాల్లోని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ ఉత్సవ సమితి, భజరంగ్ దళ్, విశ్వహిందూపరిషత్, స్టేషన్ హానుమాన్ భజనమండలిల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన వీర హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది.ఈ యాత్రలో
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రోహిత్ పాల్గొన్నారు. సాయంత్రం స్టేషన్ హానుమాన్ మందిర్ నుంచి ఈ శోభాయాత్ర ప్రారంభమయ్యింది. స్టేషన్ హనుమాన్, మార్వాడిబజార్, భద్రేశ్వరౌ చౌక్, గాంధీచౌక్, వినాయక చౌక్, ఇందిరాచౌక్, ఐలిరోడ్, రైల్వేకాలనీల మీదుగా ఈ యాత్ర ముందుకుసాగింది. ఈ శోభాయాత్రలో శ్రీ వీరాంజనేయ స్వామి, శ్రీరాముని విగ్రహ ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరోవైపు శోభాయాత్రలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
తరలివచ్చిన ప్రజా ప్రతినిధులు, నాయకులు
తాండూరులో జరిగిన హనుమాన్ జయంతి ఉత్సవాలకు ప్రజా ప్రతినిధులు, నాయకులు, సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలించ్చారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్లు విజయాదేవి, మంకాల రాఘవేందర్, ప్రవీణ్ గౌడ్, బోయరవి, రాము, అంతారం లలిత, సాహు శ్రీలత, సంగీత ఠాకూర్, లావణ్య, ప్రభాకర్ గౌడ్, భీంసింగ్, టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, రాజుగౌడ్, బంటుమల్లప్ప, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్, సాయిపుత్ర హోమ్స్ అధినేత శంకర్ యాదవ్, బీసీ సంఘం కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్, భద్రేశ్వరాలయ చైర్మన్ బంటారం భద్రేశ్వర్, స్టేషన్ హనుమాన్ చైర్మన్ సంజీవరావు, చైర్మన్ రాజన్ గౌడ్, ఇతర పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు, రాజకీయ నేతలు, సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున యాత్రలో పాల్గొని స్వామి వార్లకు పూజలు నిర్వహించారు.

ముస్లిం యువతను అభినందించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
హనుమాన్ జయంతిలో మత సామరస్యత సంతరించుకుంది. శనివారం జరిగిన హనుమాన్ శోభాయాత్రలో తాండూరుకు చెందిన ముస్లిం యువత ప్రజలకు చల్లని పానీయాలను పంపిణీ చేశారు. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పానియాలను పంపిణీ చేసిన యువతను అభినందించారు. అంతకుముందు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు కూడ యువతను అభినందించారు.

పూజలు చేసిన జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
తాండూరులో జరిగిన హనుమాన్ జయంతిలో వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని స్టేషన్ హనుమాన్ దేవాలయంలో ఆంజనేయ స్వామిని ఎస్పా కోటిరెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో వెలసిన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డికి ఆలయ చైర్మన్ సంజీవరావు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఎస్పీ వెంట తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, పోలీసులు అధికారులు ఉన్నారు.


