పల్లెల్లో ఎమ్మెల్సీ జోరు..!
– రెండో రోజు సిరిగిరిపేట్ గ్రామంలో మహేంద్రుడి పర్యటన
– బసవన్న ఆలయంలో పూజలు, ప్రజల సమస్యలపై ఆరా
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి జోరు పెంచారు. తాండూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ సందడి చేస్తున్నారు. శనివారం మండలంలోని సంకిరెడ్డిపల్లి, సంకిరెడ్డిపల్లి తాండాలో పర్యటించి కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఆదివారం సిరిగిరిపేట్ గ్రామంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పర్యటించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సందడి చేశారు.
వరుసగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పల్లెల్లో పర్యటనలతో పార్టీ నాయకులు, కార్యకర్తలలో నూతనోత్సాహాం నిండింది. గ్రామాల్లో సమస్యలు తెలుసుకుని భరోసా కల్పించడంతో మహేంద్రుడి అండకు ప్రజలు, నాయకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గ్రామాల్లో సమస్యల పరిష్కారం, అభివృద్ధికి కృషి చేస్తామని ప్రజలకు, నాయకులకు అభయమిస్తున్నారు. ఆదివారం సిరిగిరిపేట్ గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గ్రామంలో నిర్మిస్తున్న కళ్యాణ బసవణ్ణ దేవాలయాన్ని సందర్శించి దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ వెంట డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, నాయకులు రావుల అంబ్రేష్, వడ్డె వెంకటేష్, ఉపసర్పంచ్ నర్సింలు, గ్రామస్తులు, అభిమానులు ఉన్నారు.

