ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీకలు
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– ఎంఐఎం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పేర్కొ న్నారు. బుధవారం ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని క్లాసిక్ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ ప్రార్థనలు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షలను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. హిందూ, ముస్లిం ఐక్యతకు ఇఫ్తార్ విందులు ప్రతీకగా నిలుస్తాయన్నారు. సీఎం కేసీఆర్ అన్ని మతాల పండుగలకు ప్రాధాన్యత ఇ స్తున్నారనితెలిపారు. మైనార్టీల సంక్షే మానికి శ్రమిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్ణం పురుషోత్తం రావు, మాజీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రవూఫ్, ఎంఐఎం పట్టణ అధ్యక్షులు హాది, నాయకులు మసూద్, కౌన్సిలర్స్ వెంకన్న గౌడ్, బోయ రవి రాజు , కో – ఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవీ, మాజీ కౌన్సిలర్ సయ్యద్ జుబైర్ లాల, బీదర్ శేఖర్ , యువ నాయకులు బిర్కట్ రఘు, అశోక్ ముదిరాజ్, కోట్ల రాజ్ కుమార్ రెడ్డి, గణేష్ నింబల్కర్, సిద్దు అయ్యా తదితరులు పాల్గొన్నారు.


