రేపు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు
– భారీగా ఏర్పాట్లు: పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం)
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు యువ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు రేపు ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం) వెల్లడించారు. మంగళవారం తాండూరు పట్టణంలోని విలియమూన్ స్కూల్ మైదానంలో జన్మదిన వేడులకు ఏర్పాట్లు చే స్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం నుంచే వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు. వేడుకలకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరవుతారని చెప్పారు. జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేత కేక్ కటింగ్ ఉంటుంద‌ని తెలిపారు. అదేవిధంగా రోహిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిర్వహించిన రోహిత్ అన్న మెగా క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, మార్కెట్ కమిటి చైర్మన్, వైస్ చైర్మన్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, టీఆర్ఎస్ పార్టీల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, యువనాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.