రేపు విద్యుత్ వినియోగ‌దారుల స‌మ‌స్య‌ల‌పై ముఖాముఖి

తాండూరు వికారాబాద్

విద్యుత్ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి అవ‌కాశం
– రేపు వినియోగ‌దారుల స‌మ‌స్య‌ల‌పై ముఖాముఖి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: విద్యుత్ వినియోగంలో వినియోగ‌దారుల‌కు తలెత్తిన సమస్యల పరిష్కారానికి అవకాశం కల్పిస్తున్నట్లు తాండూరు విద్యుత్ డీఈ వెంకన్న ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 10న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ ఆధ్వర్యంలో జిల్లా విద్యుత్ వినియోగదారులతో ముఖాముఖి ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు.  శుక్రవారం ఉదయం 10-30 గంటల నుంచి పట్టణంలోని దుర్గా గ్రాండ్యూర్ హోటల్లోని 4వ అంతస్తులో సమావేశం కొనసాగుతుందని చెప్పారు. విద్యుత్ వినియోగంలో ఏమైనా సమస్యలు ఉంటే ఈ ముఖా ముఖిలో అధికారుల దృష్టికి తీసుకవవ‌చ్చారు. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించరించుకోవచ్చని సూచించారు. ఈ అవకాశన్ని వినియోగ దారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.