రాహుల్ గాంధీతో కాంగ్రెస్‌కు మంచిరోజులు
– భారత్ జోడో యాత్ర విజయవంతం కావాలి
– కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్
– శివాలయం, చెర్చిలలో పూజలు, ప్రార్థనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: దేశంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్న రాహుల్ గాంధీతో పార్టీకి మంచి రోజులు వస్తాయని ఆ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం సంపూర్ణ భారత దేశ యాత్రకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సిద్ధమయ్యారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి జమ్మూకాశ్మీరులోని శ్రీనగర్ వరకు చేపట్టిన ఈ యాత్ర విజయవంతం కావాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు పట్టణంలోని అంతప్ప బావి శివాలయంలో పూజలు నిర్వహించారు. అదేవిధంగా చెర్చిలో ప్రార్థనలు చేశారు. అంతకుముందు భారత్ జోడో యాత్ర కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పతనాన్ని నిరోధించడానికి, తిరిగి ప్రాణం పోయడానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో దేశమంతా పాదయాత్ర చేయబోతున్నారని తెలిపారు. బీజేపీని ఎదుర్కొనేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రాహుల్ గాంధీతోనే కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనీయర్ నాయకులు కోర్వార్ నగేష్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కావలి సంతోస్ కుమార్, నాయకులు లింగదలి రవికుమార్, హేమంత్ కుమార్, నారా అశోక్, ఎన్ఎస్‌యూఐ జిల్లా కార్యదర్శి జోగుల ఎబినేజర్ తదితరులు పాల్గొన్నారు.


