విద్యార్థుల చదువుకు ప్రభుత్వం అండ
– మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
– ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి అన్నారు.

గురువారం తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందించిన నోట్ బుక్స్‌ను పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. చైర్ పర్సన్ నీరజా బాల్‌రెడ్డి హాజరై విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యే అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి, ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.

అంతకుముందు విద్యార్థులకు చైర్ పర్సన్ భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


