తిరంగా రెప రెపలు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తిరంగా రెప రెపలు..!
– తాండూరులో ఉత్సాహంగా ర్యాలీ
– దేశభక్తి నినాదాలతో మార్మోగిన పురవీధులు
– భారీగా తరలివచ్చిన, నేతలు ప్రముఖులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులో తిరంగా జెండా రేప్రేపలాడింది. శుక్రవారం పట్టణంలో తిరంగా ర్యాలీ ఉత్సాహంగా నిర్వహించారు.

తిరంగా యాత్ర అభియాన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ జెండాలను చేతబూని పెద్ద సంఖ్యలో ప్రజలు, యువత, విద్యార్థులు, వ్యాపారులు, వివిధ వర్గాల వారు పాల్గొన్నారు. భారీ జాతీయ జెండాను పట్టణ పుర వీధుల్లో ఊరేగించారు.

తాండూరు గంజ్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ ముల్కీ చెట్టు, గాంధీచౌక్, భద్రగుడి చౌరస్తా, శాంతి మహల్ చౌరస్తా, వినాయక్ చౌరస్తా మీదుగా సాగి ఇందిరా చౌరస్తా వద్దకు చేరుకుంది. అనంతరం తిరిగి గంజ్‌ ప్రాంతానికి చేరుకోవడంతో ర్యాలీ ముగిసింది.

జాతీయ జెండా రెపరెపలాడుతుండగా.. దేశభక్తి నినాదాలతో తాండూరు పట్టణం మార్మోగింది. ర్యాలీ సందర్భంగా జాతీయ ఐక్యత, దేశభక్తి, సమైక్యతను చాటేలా పాల్గొన్నవారు సందేశాన్ని ఇచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పలువురు పిలుపునిచ్చారు.

తాండూరులో నిర్వహించిన తిరంగా ర్యాలీ కూడా అదే స్ఫూర్తిని ప్రతిబింబించేలా సాగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజు, బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం, మాజీ కన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, సాహు శ్రీలత, నాయకులు బంటు మల్లప్ప, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, పట్టణ ప్రముఖులు, సంఘాల నాయకులు, పలు పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

నిషేధిత భూముల యజమానులకు ఊరట..!