ఆర్టీసీ బస్సు, బైకు ఢీ..!
– అనంతగిరి ఘాట్ వద్ద ఘటన
– యువకుడికి గాయాలు, చికిత్సకు తరలింపు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ అనంతగిరి ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఢీకొన్నాయి. ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే యువకుడు రాంగ్ రూట్లో రావడంతో ప్రమాదం జరిగిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

గురువారం వికారాబాద్ టూరిజం హోటల్ సమీపంలోని ఘాట్ రోడ్డు మూల మలుపు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తాండూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (TG.34 Z 0019) హైదరాబాద్ వైపు వెళ్తుండగా.. అదే సమయంలో వికారాబాద్ నుంచి అనంతగిరి వైపు వెళ్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ (TS 08 HS 4899)వస్తోంది.

ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న మధువర్ధన్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన బస్సు ప్రయాణికులు గాయపడిన యువకుడిని వికారాబాద్ జనరల్ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వికారాబాద్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. కాగా బైకుపై ఉన్న యువకుడు రాంగ్ రూట్లో రావడంతో అదుపు తప్పి ప్రమాదం జరిగిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.


