కొత్త మున్సిప‌ల్‌కే రండి..!

తాండూరు వికారాబాద్

కొత్త మున్సిప‌ల్‌కే రండి..!
– అక్క‌డినుంచే మున్సిప‌ల్ సేవ‌లు
– తాండూరు ఆర్డీఓ, ఇంచార్జ్ క‌మీష‌న‌ర్ అశోక్ కుమార్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: మున్సిప‌ల్ సేవ‌ల కోసం ప్ర‌జ‌లు ప‌ట్ట‌ణంలోని లారీ పార్కింగ్ వ‌ద్ద అందుబాటులోకి తీసుక‌వ‌చ్చిన నూత‌న భ‌వన కార్యాల‌యానికి రావాల‌ని ఇంచార్జ్ క‌మీష‌న‌ర్, తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్ తెలిపారు. మంగ‌ళ‌వారం ఆయ‌న విలేకరుల‌తో మాట్లాడారు. పాత మున్సిప‌ల్ భ‌వ‌నం నుంచి కొత్త మున్సిప‌ల్‌కు అన్ని విభాగాల‌ను త‌ర‌లించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. సోమ‌వారం నుంచి కొత్త మున్సిప‌ల్‌లో ప‌రిపాల‌న ప్రారంభ‌మ‌య్యింద‌న్నారు. కావున ప్ర‌జ‌లు వివిధ ప‌నుల కోసం కొత్త మున్సిప‌ల్ కార్యాల‌యానికి రావాల‌న్నారు. కొత్త మున్సిప‌ల్ నుంచి అందించే సేవ‌ల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. అదేవిధంగా దాదాపు రూ. 4 కోట్ల‌తో కొత్త మున్సిప‌ల్‌ను అందుబాటులోకి తీసుక‌వ‌డం జ‌రిగింద‌ని, మంత్రి స‌బితారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించ‌డం జ‌రిగింద‌ని గుర్తుచేశారు. పాల‌క‌వ‌ర్గం స‌హాకారంతో కొత్త మున్సిప‌ల్‌లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి ప‌నుల‌ను పూర్తి చేస్తామ‌ని పేర్కొన్నారు.