నేడే ఎక్సైజ్ వాహనాల వేలం

తాండూరు వికారాబాద్

నేడే ఎక్సైజ్ వాహనాల వేలం
– తాండూరు ఇంచార్జ్ ఎక్సైజ్ సీఐ చంద్రకాంత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి:  నేడు తాండూరు ఎక్సైజ్ సర్కిట్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను వేలం వేస్తున్నట్లు ఇంచార్జ్ సీఐ చంద్రకాంత్ రెడ్డి తెలిపారు. ఎక్సైజ్ శాఖ జిల్లా సూపరిండెంట్ నవీన్ చంద్ర ఆదేశాల మేరకు గురువారం ఉద‌యం 10 గంట‌ల‌కు తాండూరు ప‌ట్ట‌ణం సాయిపూర్‌లోని ఎక్సైజ్ కార్యాలయంలో వేలం జరుగుతుందని వెల్లడించారు. ఈ వేలంలో బజాజ్ ఆటోరిక్ష, బజాజ్ ఆటోతో పాటు హీరో హోండా స్ప్లెండర్ బైక్, స్ప్లెండర్ ప్లస్ బైక్, బజాన్ ప్లాటినా బైక్, హెచ్ఎఫ్ డీలక్స్ బైక్, బజాజ్ సీటీ 100 బైక్, హీరో ఫ్యాషన్ ప్రో బైక్, హీరో హోండా ఫ్యాషన్ ప్లస్ బైకులు ఉన్నాయని వివరించారు. తాండూరు, వికారాబాద్ ప్రాంతాల వాహ‌న‌దారులు ఈ వేలంలో పాల్గొని వాహనాలను సొంతం చేసుకోవచ్చని సూచించారు. పూర్తి వివ‌రాల‌కు ఎక్సైజ్ కార్యాయ‌లంలో సంప్ర‌దించ‌వ‌చ్చ‌న్నారు.