30వ వార్డులో టీఆర్ఎస్ జెండా పండగ
– జెండా ఎగురవేసిన కౌన్సిలర్ మెహరాజ్ భేగం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి 30వ వార్డులో టీఆర్ఎస్ జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. గురువారం పార్టీ ఆదేశాల మేరకు వార్డులో కౌన్సిలర్ మెహరాజ్ భేగం, టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు అఫ్పూ(నయూం) ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. అనంతరం నేతలతో కలిసి రాష్ట్రగీతం ఆలాపిస్తూ జెండాకు వందనం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మెహరాజ్ భేగం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, సీనీయర్ నాయకులు రాజుగౌడ్, యువనాయకులు షల్లో, ఇంతియాజ్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
