తాగునీరు జాగ్రత్తగా వాడుకోవాలి
– ఫ్రెష్ వాటర్ ఫ్రెండ్స్ సహాకారం అభినందనీయం
– రాజీవ్ కాలనీ కౌన్సిలర్ జావిద్
– బోర్ వెల్ మోటార్ ప్రారంభించిన కౌన్సిలర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాగునీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తాండూరు మున్సిపల్ రాజీవ్ కాలనీ కౌన్సిలర్ జావిద్ అన్నారు.

ఆదివారం రాజీవ్ కాలనీ వెనుక ప్రాంతంలోని శివసాయి కాలనీలో స్థానిక నజరేతు ప్రేయర్ హాల్ ఆధ్వర్యంలో ఫ్రెష్ వాటర్ ఫ్రెండ్స్ సహకారంతో కొత్త బోర్వెల్ వేసి మోటర్ ఫిట్ చేశారు. ఈ కార్యక్రమానికి కౌన్సిలర్ జావిద్ హాజరై బోరు మోటారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నజరేతు ప్రేయర్ హాల్, ఫ్రెష్ వాటర్ ఫ్రెండ్స్ సహాకారం అందించిన సహాకారం అభినందనీయమని అన్నారు. ప్రజలు త్రాగునీరు జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకు సంరక్షించుకుంటూ తాగునీరును వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ కి అశోక్ కుమార్, అంకిత్ కురు కంటి, అచ్చ రవి, ప్రేమ్ పసరా, దీపక్, రోషన్, రోహిత్, సాంబన్న, తదితరులు పాల్గొన్నారు.


