హరోం.. హర..!

తాండూరు రాజకీయం వికారాబాద్

హరోం.. హర..!
– తాండూరు గోశాలలో నేత్రపర్వంగా మహారుద్రాభిషేకం
– కార్తీక సోమవారం శివనామస్మరణతో మార్మోగిన ప్రాంగణం
– భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన శంకర్‌ యాదవ్‌ దంపతులు
– హాజరైన రామదాసి సురేష్‌ ఆత్మారామ్‌
– పాల్గొన్న చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: కార్తీక మాసం పవిత్ర సోమవారాన్ని పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని సీతారాంపేట్‌ గోశాలలో నిర్వహించిన మహారుద్రాభిషేకం భక్తిభావంతో కన్నుల పండువగా సాగింది.

లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హరోం.. హర.. ఓం నమఃశివాయ నామస్మరణతో గోశాల ప్రాంగణం మార్మోగింది. మొయినాబాద్‌ శ్రీదామదాసి మఠాధిపతి, చిలుకూరు బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు శ్రీ రామదాసి సురేష్‌ ఆత్మారామ్‌ మహరాజ్‌ విశిష్ట అతిథిగా హాజరయ్యారు.

దైవజ్ఞ విశ్వం పంతులు ఆధ్వర్యంలో సాయిపుత్ర హోమ్స్‌ అండ్‌ డెవలపర్స్‌ అధినేత, అంతర్జాతీయ సేవారత్న అవార్డు గ్రహీత బావనోళ్ల శంకర్‌ యాదవ్‌, చంద్రకళ దంపతులు శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో జరిగిన మహారుద్రాభిషేకం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది. శివనామస్మరణ, భక్తి భావనలతో కార్యక్రమ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. భక్తుల రాకతో గోశాల కిక్కిరిసిపోయింది.

ఈ వేడుకకు రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డితో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమల్, డా. సంపత్ కుమార్, టీపీసీసీ ప్రచార సమన్వయ కర్త కరణం పురుషోత్తం రావు, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, శంకర్ యాదవ్ మిత్ర బృందం బంటు మల్లప్ప, ప్రభాకర్ గౌడ్, జొన్నల వినోద్, గోశాల గౌరవ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, అధ్యక్షులు వినోద్ కుమార్ జైన్, కోశాధికారి పటేల్ విజయ్, సభ్యులు ఓం ప్రకాష్ సోమాని, బాలాజీ వెంకట్, ఎస్ రాము, విష్ణురామ్ చౌదరి, సాయిపుత్ర సేవా సమితి ప్రతినిధులు, తాండూరుకు చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అద్దె బస్సులు..!