ఇందిరమ్మ బీమాతో పేద కుటుంబాలకు ధీమా!
– కష్టకాలంలో రూ.5 లక్షల ఆర్థిక భరోసా
– చెన్నారంలో ఇంటింటికీ ప్రచార కరపత్రాల పంపిణీ
యాలాల, దర్శిని ప్రతినిధి : పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అమలు చేస్తోందని యాలాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కే. మహిపాల్ అన్నారు.

అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకం ప్రయోజనాలను తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యాలాల మండలం చెన్నారం గ్రామపంచాయతీలో కే. మహిపాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఇంటింటికీ వెళ్లి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రచార కరపత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గ్రామస్థులకు పథకం ఉద్దేశాలు, ప్రయోజనాలను వివరించారు. నాయకులు మాట్లాడుతూ.. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తికి అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా రూ.5 లక్షల బీమా భరోసా కల్పించడమే ఈ పథకం ఉద్దేశమని తెలిపారు.

ప్రజా సంక్షేమం, కుటుంబాల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. పథకానికి సంబంధించిన వివరాలను ప్రతి ఇంటికీ చేరవేసి అర్హులైన వారందరికీ అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ అనిల్ కుమార్ గుప్తా, మాజీ పీఏసీఎస్ చైర్మన్ జి. సురేందర్ రెడ్డి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ నర్సిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఉపసర్పంచుల అధ్యక్షుడు వెంకటయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వీరేశం, అమర్నాథ్ రెడ్డి, హనుమంత్ ముదిరాజ్, భీమప్ప, మల్లయ్య, పవన్ కుమార్ రెడ్డి, నరసింహులు, మదరప్ప, రాములమ్మ, సురేష్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


