శ్రీశైలం బ్రమరాంబ మల్లన్నను దర్శించుకున్న విఠల్‌ నాయక్‌

తాండూరు రాజకీయం వికారాబాద్

శ్రీశైలం బ్రమరాంబ మల్లన్నను దర్శించుకున్న విఠల్‌ నాయక్‌
– తాండూరు ప్రజల సుఖసంతోషాల కోసం ప్రత్యేక పూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి:  ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో వెలసిన శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామిని తాండూరు మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వర్త్య విఠల్‌ నాయక్‌, కిష్టమ్మ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉదయాన్నే ఆలయంలో అభిషేకం, అర్చనల్లో పాల్గొన్న దంపతులు స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కోటి దీపాల కార్యక్రమంలో భాగంగా స్వయంగా దీపాలు వెలిగించి భక్తిని చాటుకున్నారు.
ఈ సందర్భంగా విఠల్‌ నాయక్‌ మాట్లాడుతూ.. కార్తీక పౌర్ణమి రోజున శ్రీశైలంలో స్వామివారిని దర్శించుకోవడం తమ పూర్వజన్మ సుకృతమన్నారు. కోటి దీపాలు వెలిగించడం అంటే మనలోని అజ్ఞాన చీకట్లను తొలగించుకుని జ్ఞానజ్యోతిని వెలిగించుకోవడమేనని పేర్కొన్నారు.

తాండూరు ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, తమ కుటుంబంతో పాటు నియోజకవర్గ ప్రజలందరిపై శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విఠల్‌ నాయక్‌ కుటుంబ సభ్యులు, అనుచరులు పాల్గొన్నారు.

మనిషిని మింగిన ఇసుక గుంతలు…!