నేడే పీఎం కిసాన్ నిధి విడుదల
– రైతులు ఖాతా చెక్ చేసుకోండిలా
దర్శిని డెస్క్ : కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన నిధులను నేడు విడుదల చేయనుంది. దీపావళీ పండగకు ముందే రైతులకు పీఎం కిసాన్ యోజన నిధులను కానుకగా అందిస్తోంది. ఈ ప్రాజెక్ట్ 2019 లో ప్రారంభించబడిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది దేశవ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన కోట్లాది మంది రైతులకు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకం. ఈ పథకం కింద రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మొత్తాన్ని రైతులకు మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున చెల్లిస్తారు. ఇప్పటి వరకు 11 విడతలు మంజూరు చేయగా తాజాగా 12వ విడత విడుదల చేయనుంది. పలుమార్లు విడుదల తేదీని వాయిదా వేస్తూ నేడు విడుదలకు అంగీకరించింది.
రైతులు చెక్ చేసుకోండి ఇలా
– ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ సందర్శించండి
– ఇప్పుడు హోమ్‌పేజీలో ‘రైతు కార్నర్ సెక్షన్’ చూడండి
– ‘బెనిఫిషియరీ స్టేటస్’ ఎంపికను ఎంచుకోండి. ఇక్కడ లబ్ధిదారుడు తన స్టేట్మెంట్ చెక్ చేసుకోవచ్చు.
– జాబితాలో రైతు పేరు, అతని బ్యాంకు ఖాతాకు జమ చేసిన మొత్తం ఉంటుంది.
– ఇప్పుడు మీ ఆధార్ నంబర్ లేదా ఖాతా నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
– ఆపై ‘డేటా పొందండి’పై క్లిక్ చేయండి.

