భాగ్య‌న‌గ‌రాన్ని ముంచెత్తిన వాన

తెలంగాణ హైదరాబాద్

భాగ్య‌న‌గ‌రాన్ని ముంచెత్తిన వాన
మూడుగంట‌ల వ‌ర్షానికి వ‌ణికిన హైద‌రాబాద్‌
ద‌ర్శిని ప్ర‌తినిధి : రాష్ట్ర రాజ‌ధాని భాగ్య‌న‌గ‌రాన్ని భారా వ‌ర్షి ముంచెత్తింది. గురువారం రాత్రి మూడు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి వణికిపోయింది. రాత్రంతా కురిసిన వర్షానికి కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్గడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇక నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మోకాలి లోతున నీళ్లు ప్రవహించాయి. దీంతో వాహనాలు ఎక్కడిక్కడ నిలిచి పోవడంతో కీలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

అత్య‌ధికంగా కురిసింది అక్క‌డే..
హైద‌రాబాద్‌లో గురువారం రాత్రి కురిసిన వ‌ర్షం యొక్క వ‌ర్ష‌పాత వివ‌రాల‌ను ఆ శాఖ అధికారులు వెల్ల‌డించారు. నగరంలోని కూకట్‌పల్లిలో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, షేక్ పేట్‌లో 9.8 సెం.మీ, శేరిలింగంపల్లిలో 8.8 సెం.మీ, సరూర్ నగర్‌లో 8.3 సెం. మీ, ఖైరతాబాద్ 7.6 సెం.మీ, బాలానగర్ 7.9 సెం.మీల వర్షపాతం కురిసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన జిహెచ్ఎంసీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సహాయక చర్యలు చేపట్టింది. రోడ్లపై నిలిచిపోయిన వరద నీటిని జిహెచ్‌ఎంసీ మాన్సూన్‌ బృందాలు యుద్ధ ప్రాతిపదిక తొలగించారు. ఇక నీటమునిగిన పలు కాలనీలకు అధికారులు రాకపోకలను నిలిపివేశారు. రోడ్లపై నిలిచిపోయిన నీటిని మ్యాన్ హోల్ మూతలు తెరిచి నీటిని తొలగించారు. మ్యాన్ హోల్స్‌ తెరిచి ఉన్న నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. నీటితో ఉన్న రోడ్లపై ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో ఇళ్లలోనుంచి బయటకు రావొద్దని సూచించారు.