ట్రూ కాలర్‌లో కొత్త ఫీచర్..!

తెలంగాణ

ట్రూ కాలర్‌లో కొత్త ఫీచర్..!
– ఫ్రాడ్ ఎస్‌ఎంఎస్‌లపై అలర్ట్ వ్యవస్థ
– ఏఐ ద్వారా వినియోగదారులకు ప్రోటక్షన్
– తెలిస్తే మీరే వావ్‌ అంటారు
దర్శిని డెస్క్: దాదాపు ఆండ్రాయిడ్ మోబైల్ వాడుతున్న వినియోగదారులకు ట్రూ కాలర్ పరిచయం అక్కర్లేని పదం. మనకు కాల్‌ చేస్తున్న వ్యక్తి ఎవరనే విషయాన్ని తెలుసుకునేందుకు ఈ యాప్‌ను ఉపయోగిస్తుంటారు. ఉపయోగం ఉంది కాబట్టే ఈ యాప్‌లో 100 మిలియన్లకుపైగా యూజర్లు ఉన్నారు. యాప్‌ను యూజర్ల సెక్యూరిటీకి పెద్ద పీట వేస్తూ తీసుకొచ్చిన ట్రూ కాలర్‌ యాప్‌లో రోజురోజుకీ కొంగొత్త ఫీచర్లను జోడిస్తున్నారు. తాజాగా మరో ఆసక్తికరమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని గురించి తెలిస్తే వినియోగదారులు యాప్‌ను అభినందించాల్సిందే. విద్యుత్ బిల్లు చెల్లింపులు, బ్యాంకులు, ఉద్యోగ ఆఫర్‌లు, కేవైసీ సంబంధిత, లోన్‌లు, ఛారిటీ, లాటరీ ఇలా రకరకాల ఆఫర్లతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికీ మన ఫోన్లకు లాటరీలు, బంపరాఫర్‌ల పేరిట రకరకాల తప్పుడు మెసేజ్‌లు వస్తుంటాయి. ఇందులో ఏది జేన్యూన్, ఏదీ ఫ్రాడ్‌ మెసేజ్ అనేది గుర్తించడమే ట్రూ కాలర్‌లో వచ్చిన కొత్త ఫీచర్. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఆధారిత ఎస్సెమ్మెస్ ప్రొటెక్షన్‌ ఫీచర్‌ను ట్రూ కాలర్‌ యాప్‌ తీసుకొచ్చింది.

ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందంటే..
మోసపూరిత మెసేజ్‌లను ట్రూ కాలర్‌ కొత్త ఫీచర్‌ గుర్తించగలదు. యూజర్ రిపోర్ట్‌లు లేకుండానే ట్రూకాలర్స్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఫ్రాడ్‌ ఎస్సెమ్మెస్‌లను గుర్తిస్తుంది.
యూజర్‌ ఫోన్‌కు మోసపూరిత ఎస్సెమ్మెస్‌ వచ్చినప్పుడు కొత్త ఫీచర్‌ ఆధారంగా ట్రూకాలర్‌ యాప్‌ ఎరుపు రంగు నోటిఫికేషన్ చూపుతుంది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. ఈ నోటిఫికేషన్ మాన్యువల్‌గా తీసేసే వరకు స్క్రీన్‌పై ఉంటుంది. ఒకవేళ యాజర్‌ పొరపాటున ఆ ఫ్రాడ్‌ మెసేజ్‌ను ఓపెన్‌ చేసినా అందులోని లింక్‌లను ట్రూకాలర్‌ డిసేబుల్‌ చేస్తుంది.